తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సలాం'. ఈమధ్య భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను చేరుకోవడంలో చాలా దారుణాతి దారుణంగా విఫలం అయింది.ఫిబ్రవరి 9 వ తేదీన తమిళంలో రిలీజైన ఈ సినిమా అసలు ఏమాత్రం ఆడియన్స్ మనసులని దోచుకోలేకపోయింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది.ఇక తెలుగులో కూడా ఈ సినిమాకి అదే పరిస్థితి ఏర్పడింది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలుగా చేసిన ఈ సినిమాకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. క్రికెట్‌తో పాటు మతాల అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ కాంత్ మొయిద్దీన్ భాయ్‌గా నటించారు.ఈ సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచే దారుణాతి దారుణమైన నెగెటివ్ టాక్ అందుకుంది. దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఈ మేరకు సూమారు రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి  కేవలం 20 కోట్లలోపే షేర్ వసూళ్లు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది.


ఇది రజినీకాంత్ కెరీర్ లోనే చెత్త రికార్డ్. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డబుల్ డిజాస్టర్‌గా మిగిలింది.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఆయనకు కోలుకోలేని నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా అందరి అంచనాల కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.దీంతో ఈ సినిమా నెలలోపే అంటే.. మార్చి మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.ఇక ఈ మూవీలో లివింస్టన్ సెంథిల్, విఘ్నేష్, జీవిత రాజశేఖర్, వివేక్ ప్రసన్న ఇంకా అలాగే తంబి రామయ్య కీరోల్స్ చేసి మెప్పించారు. అలాగే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గ్రహీత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: