తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది మూవీ తో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈ నటుడు పలకనామ దాసు అనే సినిమా లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ఈయన స్వీయ దర్శకత్వం కూడా వహించడం విషయం. ఈ సినిమాతో విశ్వక్  మాస్ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఇకపోతే విశ్వక్ కొంత కాలం క్రితమే గామి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అలాగే ఇందులోని విశ్వక్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.  ప్రస్తుతం ఈయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ ను చూపిస్తున్న ఈయన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అప్డేట్ కూడా తాజాగా వెలవడింది.  విశ్వక్ కెరియర్ లో పదవ సినిమాగా రూపొందబోయే మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ బృందం తాజాగా ఓ పోస్టర్ విడుదల చేయగా అది డిఫరెంట్ గా ఉండడంతో దానికి కూడా ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ని రామ్ తాళ్లూరి నిర్మించనుండగా ... రవితేజ మల్లపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs