టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ మూవీతో తన రేంజ్ ని అమాంతం పెంచుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చి పెట్టడమే కాకుండా.. తేజ క్రేజ్ ను కూడా నేషనల్ వైడ్ గా పెంచేసింది. దీంతో ఈ యువ హీరో నటించే కొత్త సినిమాలపై అందరి దృష్టి పడింది.అలాగే హనుమాన్ మూవీ సీక్వెల్ లో కూడా తేజ సజ్జా నటించనున్నారు. అయితే ఆ సినిమాలో హనుమంతుడిదే ముఖ్యపాత్ర అని ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించడం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే హనుమాన్ కన్నా ముందే సైన్ చేసిన మిరాయ్ మూవీని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు తేజ. ఈ హిస్టారికల్ మూవీ టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ గురువారం ఉదయం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.మిరాయ్ మూవీ మేకింగ్ వేరే లెవెల్ లో ఉండబోతుందని గ్లింప్స్ చూస్తేనే చాలా ఈజీగా తెలిసిపోతోంది.


ముఖ్యంగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లడం పక్కాగా కనిపిస్తోంది. గ్లింప్స్ లో పోరాటాలు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిన మిరాయ్ గ్లింప్స్.. నేషనల్ వైడ్ గా అన్ని భాషల్లో కూడా ట్రెండింగ్ నెం.1 గా నిలిచింది. అన్ని వర్గాల సినీ ఆడియన్స్ నుంచి ఈ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ గ్లింప్స్ లోని విజువల్స్ కు సినీ ప్రియులు బాగా ఫిదా అయిపోతున్నారు. రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్ కట్ అంటే ఇదేనంటూ కొనియాడుతున్నారు. సినిమా కంటెంట్ అదిరిపోయేలా ఉండనున్నట్లు అర్థమవుతోందని నెటిజన్స్ అంటున్నారు. ముఖ్యంగా మూవీలోని పోరాటాలు ఆకట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. హనుమాన్ ని మించేలా  విజువల్ ఫీస్ట్ గా మిరాయ్ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు. ఓవరాల్ గా గ్లింప్స్ అదరహో అంటూ నెటిజన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: