తెలుగు ప్రేక్షకులకు సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈతరం ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు కుర్రాల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తెలుగులో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి అప్పట్లో టాప్ హీరోయిన్గా కొనసాగింది ఈ బ్యూటీ. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమాలో హమ్మ హమ్మ పాటతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ పాట సోనాలి కెరియర్ను మలుపు తిప్పింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఒకవేళ ఈ పాట గనక కాకపోయి ఉంటే అప్పట్లో సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అని అనుకుందట సోనాలి. ఆ తర్వాత ఈ పాట మంచి హిట్ కావడంతో అలాగే కంటిన్యూ అయింది. ఇకపోతే మహేష్ బాబు హీరోగా నటించిన మురారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తన అమాయకమైన నటనతో అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది. అలా తెలుగు స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. దానితోపాటు మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర నాగార్జునతో మన్మధుడు శంకర్ దాదా వంటి సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్

 విజయాలను అందుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి క్రేజ్  తెచ్చుకుంది. 2013లో చివరిసారాగ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా లో నటించింది. ఆ తర్వాత గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్రామేబాజ్, టెలివిజన్ సిరీస్ అజీబ్ దాస్తాన్ హై యే వంటి రియాల్టీ షోలలో జడ్జీగా కనిపించింది. 2018లో క్యాన్సర్ బారిన పడింది. కొన్నాళ్లపాటు న్యూయార్క్ లో క్యాన్సర్ చికిత్స తీసుకుని కోలుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన ఆమె.. ఇప్పుడు తిరిగి ల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ది బ్రోకెన్ న్యూస్ విజన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. జీ5లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన లైఫ్, ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: