ఇడియట్ సినిమా ప్రతి ఒక్కరికి ఎంతగానో ఇష్టం. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా, హీరోయిన్గా రక్షిత నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. కాగా, ఈ సినిమాలో రక్షిత తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్ గా మారింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.


రక్షిత ఇడియట్ సినిమా అనంతరం ఎన్టీఆర్, నాగార్జున, మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లోనే నటించి ఆకట్టుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కన్నడలోనూ కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఏమైందో తెలియదు ఆ తర్వాత ఈ బ్యూటీకి సినిమాల్లో అవకాశాలు తగ్గాయి.


సినిమాలు తగ్గిన సమయంలోనే ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహ అనంతరం తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపింది. అనంతరం వీరికి ఒక బాబు జన్మించాడు. సినిమాలకు పూర్తిగా దూరమైన రక్షిత ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలను నిర్మించింది. అంతే కాకుండా పలు టీవీ షోలలో పాల్గొంది. ప్రస్తుతం బుల్లితెర పైన పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.


ఈ మధ్య కాలంలో ఇడియట్ సినిమా రక్షిత సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: