అనిల్ రావిపూడి .. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్ గా మారిపోయాడు . అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి అన్న విషయాలు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క సీన్ ని చాలా ఎంటర్టైనింగ్ తెరకెక్కిస్తూ ఉంటాడు . అందుకే అనిల్ రావిపూడి కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ . ఇప్పుడు అనిల్ రావిపూడి - చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు . ఇది ఆయన డ్రీమ్ అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు.


రీసెంట్ గానే వికటరీ వెంకటేష్ తో "సంక్రాంతికి వస్తున్నాం"  సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టేసిన ఈ డైరెక్టర్  ఇప్పుడు చిరంజీవితో మరొక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఇది కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటూ తెలుస్తుంది . అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చిన్నపిల్లాడి చేత బూతులు తిట్టించిన సీన్స్ చాలామంది జనాలకు నచ్చలేదు . ఇది ఓ కాంట్రవర్సీ గా కూడా మారింది. ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కూడా ఓపెన్ గానే ప్రశ్నించారు  రిపోర్టర్స్. అఫ్ కోర్స్ దానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చిన ఆన్సర్ కన్వీన్సింగానే ఉన్నింది.



అయితే చిరంజీవి ముందుగానే ముందుచూపుతో అలా చిన్నపిల్లలతో వల్గర్ సీన్స్ లాంటి కామెడీ తన సినిమాలో వద్దు అంటూ ముందుగానే చెప్పేసారట . సినిమా కామెడీగా ఉండాలి.. ఎంటర్టైనింగ్ గా ఉండాలి.. నవ్వుకోవాలి కానీ ఈ సినిమాపై ఒక్కరు కూడా వేలెత్తి చూపియకూడదు ఆ విధంగా ఈ సినిమాను తెరకెక్కించాలి అంటూ కండిషన్ పెట్టారట.  అనిల్ రావిపూడి కూడా  ఓకే బాస్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఖచ్చితంగా ఈ సినిమాతో ఘరానా మొగుడు లాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు చిరంజీవి అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: