- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషన్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా పుష్ప 2. ఈ సినిమా థియేట‌ర్లలో ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనం చూశాం. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా రికార్డుల్లో నిలిచింది. తాజాగా పుష్ప 2 సినిమా బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్ షో టెలికాస్ట్ అయ్యింది. బుల్లి తెర‌పై ఈ సినిమాకు షాక్ త‌గిలింది. పుష్ప 2 సినిమాకు బుల్లితెర నుంచి అనుకున్న మేర రెస్పాన్స్ దక్కలేదు.


పుష్ప 2కు బుల్లి తెర మీద‌ కేవలం 12.6 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో (29.4), పుష్ప ది రైజ్ (22.5) రేటింగ్స్ సాధించ‌డంతో పుష్ప 2కు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంద‌నే అంద‌రూ అనుకున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు ఇంత త‌క్కువ టీఆర్పీ రేటింగ్స్ రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: