
ఇక డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి భారతదేశంలోని వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిపెట్టారు . అలాగే అపోలో హాస్పిటల్స్ స్థాపకుడిగా ఆయన గొప్ప నాయకత్వం దేశ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్ళటంలో కీలక పాత్ర పోషించాయి .. అలాగే ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడంలో వారి నిబద్దత వారికి ఎంతో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాయి .. అలాగే అపోలో హాస్పటల్స్ స్థాపికుడుగా ఆయన దూరదృష్టి ఆరోగ్య రంగాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి ..ప్రతాప్ రెడ్డికి పద్మ విభీషణ్ కూడా వరించింది .. ఇక ఆయనకు 90 ఏళ్లు దాటినా కూడా ఆయన చేసే పని పట్ల ఎలాంటి ఉత్సాహం తగ్గలేదు .. ఇలాంటి గొప్ప వ్యక్తి గత ఏడాది ఫోర్బ్స్ యొక్క అత్యంత ధనవంతులైన భారతీయుల జాబితాలో 94వ స్థానంలో నిలిచాడు .. ఇలా ఉపాసన తాత గారు 91 సంవత్సరాలు దాటుతున్న కూడా తాను చేసే పని పట్ల ఎంతో నిబద్ధతగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతూ పేద ప్రజలకు సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు ..