
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘ హిట్ 3 ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్‌తో దూసుకు పోతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన హిట్ 3 సినిమా అన్ని ఏరియాల్లోనూ అదర గొట్టేస్తోంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు తొలి ఆట నుంచే సాలిడ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల వీరవిహారం చేస్తోంది. అన్ని ఏరియాల్లోనూ హిట్ 3 సినిమా కు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇక మరీ ముఖ్యంగా నాని సినిమాల కు కంచుకోట అయిన ఓవర్సీ స్‌లో ఈ సినిమా విజృంభిస్తోంది. హిట్ 3 సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.
ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి హౌస్ ఫుల్స్ తో వెళుతోంది. ఈ మూమెంట్ చూస్తుంటే లాంగ్ రన్‌లో హిట్ 3 ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు. దీనిని బట్టి ఓవర్సీస్ లో నాని ఫాలోయింగ్ , క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. హిట్ 3 సినిమాలో నాని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నాని నటించిన 11 సినిమాలో ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేయడం విశేషం. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు