జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ కథను ఒకటికి పది సార్లు బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన బాడీ నేచర్ కు సెట్ అవుతుంది అంటేనే ఓకే చేస్తాడు.  అది అందరికీ తెలిసిందే కానీ రెండు సినిమాలు విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అని కూసింత ఘాటుగానే మాట్లాడుకున్నారు  జనాలు. ఆ రెండు సినిమాలు మరేంటో కాదు "ఊసరవెల్లి" ..అదేవిధంగా "దమ్ము".  ఊసరవెల్లి సినిమా కథ కాన్సెప్ట్ అంతా బాగుంది కానీ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కన్నా కూడా హీరోయిన్ క్యారెక్టర్ హైలెట్గా మారింది .

ఎన్టీఆర్ లాంటి బిగ్ బడా హీరో ఆ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆయన క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.  కానీ ఊసరవెల్లి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా తారక్ ది ఉంటుంది . సినిమా చూసిన ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్. ఆ కారణంగానే ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది . ఈ సినిమా చూసిన ప్రతిసారి కూడా నందమూరి అభిమానుల ఫీలింగ్ "ఎందుకు ఎన్టీఆర్  ఈ సినిమాని ఓకే చేశావ్..?" అని ..

కానీ దానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర "నో" ఆన్సర్ . అంతే కాదు "దమ్ము" సినిమా చూసినా కూడా ఎన్టీఆర్ అభిమానులు అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు . అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ తన రేంజ్ .. తన స్థాయి మరిచిపోయి ఇలాంటి సినిమాలో నటిస్తూ ఉంటాడు .. ఎన్టీఆర్ అంటే ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.   ఎన్టీఆర్ సినిమాలకు కమిటీ అయ్యే ముందు ఆ విషయం ఆలోచించరా ..? అంటూ కూడా కొంతమంది నిలదీశారు . కాగా జూనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించే విధంగా కూడా మాట్లాడారు . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని దిగమింగుకొని మరి తన నెక్స్ట్ సినిమాలతో హిట్ కొట్టి వాళ్ళ నోర్లు మూయించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: