2025 సంవత్సరం మే నెల 1వ తేదీన విడుదలైన హిట్ సినిమా హిట్ గా నిలవగా రెండో వారం విడుదలైన శ్రీవిష్ణు #సింగిల్ సినిమాపై కూడా మంచి సినిమాలే నెలకొన్నాయి. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నేడే విడుదల కాగా వరుస విజయాలు అందుకుంటూ మినిమం గ్యారంటీ హీరోగా పేరు సంపాదించుకున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుందో చూద్దాం.
 
కథ :
 
ఒక బ్యాంక్ లో జాబ్ చేస్తున్నవిజయ్(శ్రీవిష్ణు) వయస్సు పెరుగుతున్నా సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తూ సింగిల్ గా లైఫ్ లీడ్ చేయడం విషయంలో టెన్షన్ పడుతూ ఉంటాడు. తన జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే తన జీవితం మారుతుందని బలంగా నమ్ముతూ ఉంటాడు. ఒకరోజు మెట్రోలో పూర్వ (కేతిక శర్మ) ను చూసి ప్రేమలో పడిన విజయ్అమ్మాయి కారు షోరూంలో పని చేస్తోందని తెలిసి అక్కడికి వెళ్లి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
 
అదే పూర్వ కోసం విజయ్ ఏం చేస్తుంటాడో హరిణి (ఇవానా) అనే అమ్మాయి విజయ్ కోసం అవే పనులు చేస్తూ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరకు ఏం జరిగింది? పూర్వ, హరిణిలలో ఎవరు విజయ్ లైఫ్ లో మిగులుతారు? విజయ్ మళ్లీ సింగిల్ గా మిగిలిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ :
 
సాధారణ కథలను సైతం ఎంటర్టైన్మెంట్ తో చెబితే అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో సింగిల్ మూవీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. దర్శకుడు కార్తీక్ రాజు ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించడంలో, డైలాగ్స్ తో మ్యాజిక్ చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారు. విజయ్ పాత్రలో శ్రీవిష్ణు జీవించగా పూర్వ, హరిణి పాత్రలకు కేతిక, ఇవానా న్యాయం చేశారు.
 
వెన్నెలకిషోర్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా రాజేంద్ర ప్రసాద్ మూర్తి పాత్రలో అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ కొత్తగా ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ సెలబ్రిటీల గెస్ట్ అప్పియరెన్స్ లు సైతం ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ పాటలతో కంటే బీజీఎంతో మెప్పించారు. 2 గంటల 9 నిమిషాల నిడివితో ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ఈ సినిమా ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీ పడలేదు.
 
బలాలు : శ్రీవిష్ణు నటన, కార్తీక్ రాజు డైరెక్షన్, వెన్నెల కిషోర్ కామెడీ, సెకండాఫ్, క్లైమాక్స్
 
బలహీనతలు : సాంగ్స్
 
రేటింగ్ : 3.25/5.0
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: