ఏంటి రణవీర్ సింగ్ పక్కన దీపిక పదుకొనే కాదు తెలుగు హీరోయిన్ భూమిక ఉండాల్సిందా..ఇంతకీ రణవీర్ సింగ్ దీపిక పదుకొనే కి భూమికకి మధ్య ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రణ్వీర్ సింగ్ పక్కన దీపిక కాదు నేను ఉండాలి అంటే చాలామంది రన్వీర్ సింగ్ భార్యగా భూమిక  ఉండాలి కావచ్చు.కానీ భూమిక కాకుండా దీపిక పదుకొనే భార్య అయింది అని అనుకుంటారు.అంతే కాదు రన్వీర్ సింగ్ భూమిక ఇద్దరు ప్రేమించుకొని డేటింగ్ చేశారు కావచ్చు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కావచ్చు.కానీ వీరి ప్రేమ బ్రేకప్ అవ్వడంతో భూమిక ప్లేస్ లోకి దీపిక పదుకొనే వచ్చింది అని ఇలా ఎంతోమంది ఎన్నో ఊహగాణాలు ఊహించుకుంటూ ఉంటారు.కానీ ఇదంతా కాదు దీపిక కాకుండా రన్వీర్ సింగ్ పక్కన నేనుండాలి అని భూమిక అనడానికి కారణం ఓ సినిమా.

 ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్లో వచ్చిన బాజీరావు మస్తానీ సినిమా అందరూ చూసే ఉంటారు.అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా రన్వీర్ సింగ్,దీపిక పదుకొనేలు నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో భూమిక మాట్లాడుతూ.. బాలీవుడ్లో వచ్చిన బాజీరావ్ మస్తానీ సినిమాలో రన్వీర్ సింగ్ సరసన మొదట హీరోయిన్ గా నాకే అవకాశం వచ్చింది. సంజయ్ లీలా బన్సాలి మొదట నన్నే హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ సినిమా నుండి నన్ను తప్పించి దీపిక పదుకొనేని తీసుకున్నారు.లేకపోతే ఆ సినిమాలో రన్వీర్ సింగ్ పక్కన దీపికా కాదు నేను ఉండాల్సింది అంటూ భూమిక సంచలన విషయాన్ని బయట పెట్టింది.అలా బాజీరావు మస్తానీ సినిమాలో మొదట హీరోయిన్ అవకాశం భూమికకే వచ్చిందట. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ భూమికని తప్పించి హీరోయిన్ గా దీపిక పదుకొనేని తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: