ఏంటి అక్కినేని అమల గారితో విజయ్ దేవరకొండకు సినిమాలో ఛాన్స్ వచ్చిందా.. కానీ విజయ్ దేవరకొండనే కావాలని ఆ సినిమాని రిజెక్ట్ చేశారా.. ఇంతకీ అక్కినేని అమల గారితో సినిమాని విజయ్ దేవరకొండ ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ కింగ్డమ్. ఈ మూవీ మే 30న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. 

అలా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ ఒకే ఒక జీవితం సినిమాలో మొదట హీరోగా నేనే ఎంపికయ్యానని,కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేసా. ఇక ఈ సినిమా కథని శ్రీ కార్తిక్ దగ్గర నేను మూడుసార్లు విన్నాను. కథ బాగా నచ్చింది. నేనే ప్రొడ్యూసర్ గా కూడా చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో నా బాడీ లాంగ్వేజ్ కి ఆ కథ సెట్ అవ్వదు అనిపించింది. అందుకే ఆ సినిమాలో నటించలేదు. ఇక నేను రిజెక్ట్ చేశాక ఈ సినిమా స్టోరీ శర్వానంద్ కి చెప్పారు.అలా ఒకే ఒక జీవితం సినిమా లో హీరో ఛాన్స్  రిజెక్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.

ఇక కింగ్డమ్ మూవీ ని ఫ్రాంచైజీ లాగా చేయడం లేదు.ఒకవేళ కింగ్డమ్ మూవీ బాగుంటే దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తే కచ్చితంగా ఈ సినిమాని ఫ్రాంచైజీగా తీసుకువస్తాం. అందుకే ఈ సినిమాకి కింగ్డమ్-1 అనే టైటిల్ పెట్టలేదు అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఇక శర్వానంద్ హీరోగా వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాలో అమల శర్వనంద్ తల్లి పాత్రలో నటించింది. సైన్స్ ఫిక్షన్ మెలో డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ గురించి వచ్చే పాట చాలామందికి ఫేవరెట్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: