సినిమా ఇండస్ట్రీ అంటే ఏ ఒకరో ఇద్దరో హీరోలు మాత్రం కాదు.. ఏ ఒకరో ఇద్దరో డైరెక్టర్లు అంతకన్నా కాదు . సినిమా ఇండస్ట్రీ అంటేనే అందరూ కలిసికట్టుగా ఉండాలి.  కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మాత్రం నాలుగు ముక్కలుగా చీలిపోయింది అన్న విధంగానే మాట్లాడుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య వచ్చిన గొడవలు సినీ ఇండస్ట్రీని నాలుగు ముక్కలుగా చీల్చేసాయి అని జనాలు ఘాటుగా మాట్లాడుకుంటున్నారు.  కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం స్టార్స్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి .


తాజాగా లండన్ లో జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళి-చరణ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా వీళ్ళు ముగ్గురు ఒక మాటపై ఉంటారు. ఒకే మాటకి కట్టుబడి ఉంటారు. అంతేకాదు మరొక పక్క అల్లు అర్జున్ - అట్లీ తమ సినిమా ప్రమోషన్స్ కోసం తమ సినిమా ఎలా సినిమా ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టాలి అన్న దానిపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు . ఇక నాగచైతన్య "తండే" మహిళ తర్వాత మరొక హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అఖిల్ ఒక సినిమా అయిన్ హిట్ కొట్టాలి అంటూ వెయిట్ చేస్తున్నారు . ఇక ప్రభాస్ గురించి అయితే చెప్పనవసరం లేదు . ఆయన కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక మిగిలింది మహేష్ బాబు తన ఫ్యామిలీ వెకేషన్ తో ఒకవైపు రాజమౌళి సినిమా షూటింగ్లో మరొకవైపు బిజీ బిజీగా ఉన్నాడు .



ఇక సీనియర్ హీరోస్ విషయానికొస్తే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎవరి ప్లాన్స్ వాళ్ళు చేస్తున్నారు . చిరంజీవి - అనిల్ రావిపూడి  దర్శకత్వంలో నటిస్తున్నాడు. వెంకటేష్ ..త్రివిక్రమ్  శ్రీనివాసరావు దర్శకత్వం లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలయ్య అఖండ 2 లో బిజీగా ఉన్నాడు. నాగార్జున తన 100వ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు.  ఇలా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా తమ తమ కెరియర్ లో బిజీ అవ్వాలని చూస్తున్నారే కానీ ఎక్కడ కలిసికట్టుగా వర్క్ చేసే ఆలోచన లేదు అని.. ప్రతి ఒక్కడు సెల్ఫ్ స్వార్ధంగా ఆలోచించి మాకు మేమంటే మాకు మేమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని..



 ఒక సినిమాకి మరొక హీరో సపోర్ట్ చేసే విషయాన్నీ పూర్తిగా మర్చిపోయారు అంటూ సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ని ఇండస్ట్రీలో జనాలు దూరం పెట్టేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు . ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది . అల్లు అర్జున్ ని ఎవరు పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏకాకిగా వదిలేసింది అంటూ సినీ ప్రముఖులు కూడా చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.  ఇదే విధంగా ముందుకు వెళ్తే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ నలుగురికి ఆదర్శంగా నిలవడం కాదు నలుగురి చేత నవ్వులు పాలు అవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇకనైనా మీకు మీరే మాకు మేము అన్న సామెతని వదిలేసి మనకు మనం అన్న సామెతను ఫాలో అయితే బాగుంటుంది అనేది సినీ విశ్లేషకులు అభిప్రాయం . చూద్దాం ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: