
నందమూరి నటసింహ .. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి వరుసగా తన ఖాతాలో నాలుగో సూపర్ డూపర్ హిట్ వేసుకున్నారు. ప్రస్తుతం మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా యూనిట్ మొత్తం జార్జియా వెళ్లనుంది. మే 21 నుంచి ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ను దర్శకుడు బోయపాటి ప్రారంభించనున్నారట. ఇప్పటికి జార్జియా లో బోయపాటి శ్రీను లొకేషన్ లు ఓకే చేశాడు.
ఇక క్లైమాక్స్ షూటింగ్లో బాలయ్య తో పాటు పలువురు ఫైటర్లు కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఇక్కడ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా లో అందాల భామ సంయుక్తమీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ . ఎస్ . తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖండ సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు అఖండ 2 మీద అంచనాలు మామూలగా లేవు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు