సరిగ్గా ఈరోజుతో కూడా కలుపుకుంటే మూడు రోజులు.. మూడు అంటే మూడు రోజుల్లోనే నందమూరి అభిమానులకు పండగ లాంటి రోజు వచ్చేస్తుంది . అదే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు . ఏ మంచి రోజునైనా ఏ పండగ రోజునైనా నందమూరి అభిమానులు మర్చిపోతారేమో కానీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మాత్రం అస్సలు మర్చిపోలేరు . ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజును కుటుంబ సభ్యులు కన్నా చాలా ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.  సోషల్ మీడియాలో ఇప్పటినుంచి నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేయాలి అంటూ పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు .


అర్ధరాత్రి 12 దాటగానే భారీ కేకులు కట్ చేయాలి అని..  అన్నదానం చేయాలి అని తారక్ పేరు చెప్పి ప్రత్యేక పూజలు చేయించాలి అని పలువురు పలు జిల్లాల్లోని ఫాన్స్ అసోసియేషన్ మెంబర్స్ ఫిక్స్ అయిపోయారు. కాక ఏ స్టార్ హీరో అయినా సరే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అంటే కచ్చితంగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది మూవీ అప్డేట్స్.  ఆ హీరో నెక్స్ట్ ఏ మూవీ లో నటిస్తున్నాడు ..? ఏ డైరెక్టర్ కాంబోలో నటిస్తున్నాడు ..? ఆ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వస్తుంది ..? అనేది తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు .



జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు . ఇప్పటివరకు సోషల్ మీడియాలో దేవర 2.. వార్ 2.. ఎన్టీఆర్ 31 సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి అంటూ ఫ్యాన్స్ 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  కానీ లాస్ట్ మీట్ లో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ఎన్టీఆర్ 31 నుంచి రావాల్సిన క్రేజీ అప్డేట్ పోస్ట్ పోన్ అవుతున్నట్లు తెలుస్తుంది.  కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఎన్టీఆర్ 31 సినిమాకి సంబంధించిన గ్లింప్స్ టైటిల్  ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టేసారట మూవీ టీం.  జస్ట్ ఎన్టీఆర్ లుక్స్ మాత్రమే రివిల్ చేసేలా మరొక వీడియోని రూపొందించారట.  సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ  న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నిజానికి దేవర 2 కన్నా వార్ 2 కన్నా కూడా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ 31 సినిమా పైనే అసలు పెట్టుకొని ఉన్నారు. అలాంటి ఎన్టీఆర్ 31 సినిమా నుంచి ఎటువంటి ప్రకటన తన పుట్టినరోజుకి రాకపోతే ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారో అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.   ఇప్పటికైనా ప్రశాంత్ నీల్ మేల్కొని ఇంతకు మించిన అప్డేట్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇది నిజంగా నందమూరి అభిమానులకు వెరీ డిస్సపాయింటెడ్  న్యూస్ అని చెప్పాలి.  చూడాలి మరి నందమూరి ఫ్యాన్స్ ని ప్రశాంత్ నీల్  ఎలా కూల్ చేస్తాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: