ఫైనలీ.. కోట్లాదిమంది అభిమానులు ఇష్టపడి కోరుకున్నదే జరిగింది . స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిహీరోయిన్ అయితే చిరంజీవి పక్కన బాగుంటుందో .. ఆ హీరోయిన్ నే చూస్ చేసుకున్నాడు.  కాళ్లు పట్టుకున్నాడో లేకపోతే హై రెమ్యూనరేషన్ ఇచ్చాడో తెలియదు కానీ అసలు తెలుగు సినిమాలకు సైన్ చేయకూడదు అని అనుకున్న నయనతారను ఆ ఉద్దేశం నుంచి వెనక్కి వచ్చేలా చేసి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారు.  దీనికి సంబంధించి కొద్ది సేపటి క్రితమే  అఫిషియల్ ప్రకటన వచ్చింది. తనదైన స్టైల్ లో ఒక వీడియో ని రిలీజ్ చేస్తున్న నయనతార - చిరంజీవి పక్కన హీరోయిన్గా నటిస్తుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు అనిల్ రావిపూడి .

కేవలం ఈ సినిమా విషయంలోనే కాదు తన ప్రతి సినిమా విషయంలోనూ ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఓ మార్క్ స్టైల్ ఫాలో అవుతున్నాడు అనిల్ రావిపూడి . ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలోనూ అదే స్టైల్ ఫాలో అయ్యాడు . నయనతార రెడీ అవుతున్నట్లు ..ఆ టైంలో ఆమె తెలుగులో మాట్లాడినట్లు ..ఆ తెలుగులో మాట్లాడడం చూసి పక్కనుండే వాళ్ళు తెలుగు సినిమా చేస్తున్నారా మేడం అని అడిగి..ఆ మూవీ ని కంఫాం చేస్తూ ప్రకటించాడు. ఆమె కారులో  వెళ్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి పాట ప్లే అవ్వడం.. డ్రైవర్ చిరంజీవితో నటిస్తున్నారా మేడం అని అడగడం అంత మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది .

ఫైనల్లీ మెగాస్టార్ చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్గా నటిస్తుంది అని తెలిసిపోయింది . వీళ్ళ కాంబోలో ఇదివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా ఇంకా హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . దానికి కారణం అనిల్ రావిపూడి డైరెక్షన్.  కాగా వీడియో చివరిలో నయనతార కెమెరా రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ అనిల్ రావిపూడి వైపు చూపించడం..  అనిల్ రావిపూడి సంక్రాంతికి అంటూ చెప్పడం నయనతార రఫ్పాడించేద్దాం అంటూ చెప్పడం హైలైట్ గా మారింది .

చాలామంది ఈ సినిమాకి "సంక్రాంతికి రప్ఫాడించేద్దాం" అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఉన్నాడు అనిల్ రావిపూడి అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆయన కెరీర్ కు బిగ్ టర్నింగ్ పాయింట్ గా మారింది అని అదే టైటిల్ ని ఉపయోగించి చిరంజీవి హిట్ డైలాగ్ "రప్ఫాడిద్దాం" అన్న పదాన్ని ఉపయోగించి ఈ విధంగా టైటిల్ పెట్టాడు అని ..మొత్తానికి నయనతార తనకి తెలియకుండానే తానే ఈ సినిమా టైటిల్ ని చెప్పేసింది అంటూ జనాలు ఓ రేంజ్ లో ఈ సినిమా టైటిల్ సంక్రాంతికి రప్ఫాడించేద్దామంటూ మాట్లాడుకుంటున్నారు . కాగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉండడం కూడా గమనార్హం.  అనిల్ రావిపూడి ఎప్పుడు ఏ టైం కి సినిమా రిలీజ్ చేస్తాను అని ప్రకటిస్తాడో అప్పుడే రిలీజ్ చేస్తాడు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఆల్ "సంక్రాంతికి రప్ఫాడిద్దం.


 టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లే అంటూ టాక్ వినిపిస్తుంది . చూద్దాం మరి దీనిపై అనిల్ రావిపూడి ఎలా స్పందిస్తారో..??


మరింత సమాచారం తెలుసుకోండి: