సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గురించి తెలుసుకోవడానికి ..స్టార్స్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వడానికి చాలామంది ఫ్యాన్స్ అలాగే జనాలు ఇష్టపడుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా స్టార్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా రాంచరణ్ మధ్య ఫ్రెండ్షిప్ చూసి అందరు కుళ్ళు కుంటారు. వాళ్ళలా మనం ఒక్కరోజు ఉన్న చాలు అంటూ మాట్లాడుకునే జనాలు కూడా ఉన్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం .


ఇదే మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ - చరణ్ కి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్ కూడా వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు . తన బర్త్డ డే ని  ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ . కాగా ఇప్పుడు చరణ్ - తారక్ ల మధ్య ఏజ్ గ్యాప్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్దవాడు అని తెలుసు కానీ ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు అనేది ఇంట్రెస్టింగ్గా చర్చించుకుంటున్నారు అభిమానులు.



రామ్ చరణ్ మార్చి 27 1985లో జన్మించాడు అంటే ఇప్పుడు రామ్ చరణ్ ఏజ్ 40 సంవత్సరాలు.  అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మే 20వ తేదీ 1983లో జన్మించాడు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఏజ్ 42 సంవత్సరాలు. చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్  సంవత్సరం పెద్ద కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  రామ్ చరణ్ కి మాత్రం ఒకటిన్నర సంవత్సరం వయసు గల ఒక పాప మాత్రమే ఉంది . జనాలు ఈ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేసి మాట్లాడుకుంటున్నారు . ఎవరు ఎన్ని అనుకున్నా సరే చరణ్ తారక్ మాత్రం ఎప్పుడు తమ మధ్య ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేయలేదు . ఆర్ఆర్ఆర్ విషయంలో ఎంత ట్రోలింగ్ జరిగినా తారక్ - చరణ్ ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడుకోలేదు . ఒకరి పుట్టినరోజులకు ఒకరు విష్ చేసుకోవడం ఒకరి సంబంధించిన ఈవెంట్స్ కి మరొక రు అటెండ్ అవుతూ ఫ్రెండ్షిప్ అంటే ఇదే అంటూ ప్రూవ్ చేశారు . వీళ్ళ కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: