
ఆసక్తికర విషయం ఏంటంటే.. స్టూడెంట్ నెం.1 చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదు. మొదట ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ తో ఈ సినిమాను ప్లాన్ చేశారు. కళ్యాణ్ రామ్ ను దృష్టిలో ఉంచుకునే రాజమౌళి స్క్రిప్ట్ రెడీ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. సరిగ్గా అదే సమయంలో హరికృష్ణ గారు ఎన్టీఆర్ ను రాజమౌళికి సజెస్ట్ చేశారు. అప్పటికే ఎన్టీఆర్ బాలనటుడిగా గుర్తింపు పొందాడు. కానీ ఎన్టీఆర్ బొద్దుగా ఉండడంతో రాజమౌళి మొదట కొంత నిరాశకు గురైనప్పటికీ.. ఆ తర్వాత ఆయన నటన, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఆశ్చర్యపోయారట.
ఫైనల్ గా తారక్ నే హీరోగా పెట్టి స్టూడెంట్ నెం.1 చిత్రాన్ని తెరకెక్కించారు. కట్ చేస్తే మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. డెబ్యూతోనే అటు ఎన్టీఆర్, ఇటు రాజమౌళికి బ్రేక్ ఇచ్చింది. స్టూడెంట్ నెం.1 సినిమా రిలీజ్ అయ్యేనాటికి ఎన్టీఆర్ వయసు కేవలం 17 సంవత్సరాలు. అయిన కూడా స్క్రీన్ మీద ఆయన నటన, హావ భావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించాయి. మొత్తంగా స్టూడెంట్ నెం.1 నుంచి కళ్యాణ్ రామ్ తప్పుకోవడం తారక్ కు దీవెన అయింది. అలాగే ఎన్టీఆర్‌లో టాలెంట్ గుర్తించి రాజమౌళి ఛాన్స్ ఇవ్వడంతో తెలుగు సినీ పరిశ్రమకు ఒక పవర్‌ఫుల్ హీరోను పరిచయం చేసినట్లైంది.