ఈ మధ్యకాలంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య పేరు దారుణాతి దారుణమైన ట్రోల్లింగ్ కి గురైంది . మొదటగా కంగువ సినిమా దారుణాతి ఫ్లాప్ టాక్ దక్కించుకోవడమే అందుకు రీజన్ . అయితే కంగువ సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు సూర్య . కానీ ఆ సినిమా దారుణాతి దారుణమైన డిజాస్టర్ అందుకోవడమే కాకుండా పరమ చెత్త కలెక్షన్స్ క్రియేట్ చేయడంతో జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.  ఆ తర్వాత ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమా "రెట్రో".


సినిమా కూడా ప్లాప్ టాక్ దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియాలో సూర్య పేరు బాగా ట్రోల్లింగ్ కి గురి అయింది . అయితే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాప్ అయితే కచ్చితంగా ఏ హీరో అయినా సరే డిప్రెషన్ కి గురవుతారు . కొంచెం మీడియా ముందుకు రావడానికి మొహమాటపడతారు . అది కూడా ఒక బిగ్ బడా స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే మీడియా ఏ రేంజ్ లో దుమ్మెత్తి పోస్తుందో అందరికీ తెలుసు . కానీ సూర్య మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి తన నెక్స్ట్ సినిమాను చక చక ట్రాక్ లోకి తీసుకొచ్చేశాడు.

 

అది కూడా స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో తన మొదటి తెలుగు సినిమాను ప్రారంభించారు.  రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.  ఈ సినిమాలో హీరోయిన్గా మమిత బైజు ని సెలెక్ట్ చేసుకున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాల పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో సూర్యకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతకు డబల్ రేంజ్ లోనే ఉంది.  ప్రతి సూర్య ఫ్యాన్ కూడా ఇప్పుడు గర్వంగా డైరెక్ట్ గా తెలుగు సినిమా చేస్తున్నాడు సూర్య అంటూ గర్వంగా మాట్లాడుకుంటున్నారు. సూర్య ఫ్యాన్స్  ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ హుందాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు . సూర్య ఎప్పుడో అభిమానులకు మాట ఇచ్చాడు . డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాను అని.. అన్నమాట నిజం చేసుకున్నాడు.  డైరెక్ట్ గా తెలుగు సినిమాను ఓకే చేసే సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: