టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా , స్క్రీన్ పై రైటర్ గా పని చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలు పెట్టాడు. ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో అనేక మూవీలు అద్భుతమైన విజయాలను సాధించడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. త్రివిక్రమ్ ఆఖరుగా మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అయింది. కొన్ని రోజుల క్రితం నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి మూవీ ని రామ్ చరణ్ తో చేయనున్నట్లు ఓ వార్త అయ్యింది. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి మూవీ ని వెంకటేష్ మరియు రామ్ చరణ్ లతో చేయనున్నట్లు , ఈ మూవీ భారీ మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ , పవన్ కళ్యాణ్ కు ఓ కథను వినిపించగా , ఆ కథ పవన్ కి బాగా నచ్చిన అందులో తన కంటే కూడా చరణ్ బాగా సెట్ అవుతాడు అని రామ్ చరణ్ పేరును సూచించినట్లు , దానితో త్రివిక్రమ్ , రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇలా పవన్ వల్ల త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా హీరో చేంజ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: