టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన హీరో ప్రభాస్ ప్రస్తుతం తన సినిమాలతో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసేలా చేస్తూ ఉన్నారు. మొదటిసారి ఒక విభిన్నమైన పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఆ సినిమా ఏదో కాదు ది
 రాజా సాబ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తూ ఉండగా ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో ప్రభాస్ కనిపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు.


తాజాగా ది రాజా సాబ్ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ వినిపిస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో తాతగా , ఆత్మగా కూడా కనిపించబోతున్నారట. ముఖ్యంగా తాత పాత్రలో ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్ లోనే మొదటిసారి హర్రర్ కామెడీ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని విషయం తెలిసి అభిమానులు కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అదరగొట్టేసింది.ఈ సినిమా మొత్తం ఒక పాత థియేటర్ నేపథ్యంలో కొనసాగు పోతుంది అన్నట్లుగా టాక్ వినిపిస్తున్నది. చాలాకాలం తర్వాత ప్రభాస్ నుండి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మరి కొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగానే చిత్ర బృందం జరుపుతున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు ఖల్ నాయక్ , సంజయ్ దత్ వంటి వారు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులలోనే జరుగుతున్నదట.వెకేషన్ మోడ్ లో ప్రభాస్ అతి త్వరలోనే షూటింగ్ కి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ది రాజా సాబ్ సినిమాకి సంబంధించి టీజర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసే విధంగా సన్నహాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: