సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని చెప్పడానికి ఇది మరో ఎగ్జాంపుల్. ఒక రోల్ కోసం అనుకున్న హీరో ఆ సినిమాను రిజెక్ట్ చేసి..ఆ రోల్లో మరొక హీరో సెలెక్ట్ అయ్యి.. అలా సెలెక్ట్ అయిన హీరో బిగ్ పాజిటివ్ టాక్ దక్కించుకుంటూ ఉంటే.. అప్పుడు ఆ హిట్ అయిన రోల్ ని  వదిలేసిన హీరో పడే బాధ వర్ణాతీతం.  అలాంటి బాధలు మన ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఫేస్ చేశారు . కేవలం హీరోలే కాదు హీరోయిన్లు కూడా అలాంటి టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .


ఇప్పుడు అలాంటి ఒక పొజిషన్ ని ఫేస్ చేస్తున్నాడు ప్రభాస్ అంటూ బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం వార్ 2. హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇంటర్నేషనల్ వైడ్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు ..అభిమానులు . నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక హాలీవుడ్ మూవీ ని చూస్తున్న రేంజ్ లోనే అనిపించేలా తెరకెక్కించాడు అయాన్ ముఖర్జీ .



మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్స్ కెవ్వు కేక . హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్స్ వేరే లెవెల్ లో ఆకట్టుకుంటున్నాయి.  ఒకటి కాదు రెండు కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అభిమానులకు ఏ ఏ ఎలిమెంట్స్ కావాలో అన్ని సెట్ చేసుకున్నాడు అయన్ ముఖర్జీ. అయితే నిజానికి ఎన్టీఆర్  ప్లేస్ లో ముందుగా హీరో ప్రభాస్ ని అనుకున్నారట అయాన్ ముఖర్జీ . ఆయనను అప్రోచ్ అయి కధ వినిపించారట.  కానీ అయాన్ ముఖర్జీ రాసుకున్న రోల్ ప్రభాస్ కి సూట్ కాకపోవచ్చు అంటూ ప్రభాస్ మేనేజర్ చెప్పడంతో ప్రభాస్ కూడా నిజమే ఈ పాత్ర నాకు సెట్ కాదు అంట రిజెక్ట్ చేసారట.  అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన పాత్రలో తారక్ సెటిల్ అయ్యాడు. ఏమాటకి ఆ  మాటే తారక్ పెర్ఫార్మన్స్ ఉంది బ్రదర్స్ వేరే లెవెల్ అంతే..!

మరింత సమాచారం తెలుసుకోండి: