
ప్రజెంట్ సుకుమార్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసేసి రెడీగా ఉన్నాడు . తాజాగా సుకుమార్ తన సొంత ఊరు "మట్టపర్రుకి" వెళ్లారు . అక్కడ తన ఫ్యామిలీతో తన కుటుంబ సభ్యులతో తన దూరపు రిలేటివ్స్ తో చాలా చాలా సరదాగా గడిపారు. మొదటి నుంచి సుకుమార్ నేచురాలిటీని ఇష్టపడతారు . ఎక్కువగా ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలను లైక్ చేస్తూ ఉంటారు . కాగా ఈ సందర్భంగా సుకుమార్ అక్కడే మీడియాతో కూడా కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు .
"రామ్ చరణ్ తో చేసే సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తయిపోయింది అని .. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని ..ఈ సినిమా కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది అని తెలియజేశారు. పుష్ప 2 తో దర్శకుడుగా నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది అని ..ఆ ఇమేజ్ ని అలాగే కాపాడుకుంటూ వస్తానని కూడా ప్రామిస్ చేశారు. ప్రతి సంక్రాంతికి తన సొంత ఊరికి వెళ్తాను అని మూడేళ్లగా పుష్ప షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాను అని .. ఆ కారణంగానే ఇప్పుడు వచ్చాను అని చెప్పుకొచ్చారు".
అంతేకాదు ఇటీవల థియేటర్స్ కి జనాలు రావట్లేదు అన్న దానిపై కూడా స్పందిస్తూ "సిటీస్ లో మాత్రమే అలా ఉంది .ఓటీటీ అంటూ సిటీస్ లో ఉండే జనాలు మాత్రమే అలవాటు పడ్డారు . కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఉండే జనాలు జనాలు థియేటర్స్ కి వచ్చే సినిమా చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు ". అయితే సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప2 సినిమా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసింది అనేది అందరికీ తెలిసిందే . అయితే జనాభా థియేటర్ లల్లో సినిమా చూడకుండానే అంత టికెట్లు రేట్లు పెట్టి ఇన్ని కలెక్షన్లు సాధించారా..? సుకుమార్ అంటూ వెటకారంగా కౌంటర్స్ పడుతున్నాయి". సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ నోట ఇలాంటి మాట వినాల్సి వస్తుంది అని ఎవరు అనుకోలేక పోయారు. సోషల్ మీడియాలో ఇప్పుడు సుకుమార్ మాట్లాడిన మాటలకు పెడ అర్థాలు తీస్తున్నారు కొందరు ఆకతాయిలు..!