జూనియర్ ఎన్టీఆర్ .. పాన్ ఇండియ‌ స్థాయిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో .. ప్రజంట్ చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు .. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్నారు .. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని  గ్లోబల్ హీరోగా మారారు .. ఆ తర్వాత దేవర‌ సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు .. ప్రస్తుతం వార్ 2 సినిమా తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న భారీ సినిమాలో కూడా నటిస్తున్నారు .. ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. వార్‌ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్ .. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ మొదటి మూవీ రెమ్యునరేషన్  గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి ..
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ చిన్న వయసులోనే హీరోగా ఎదిగారు .. కెరియర్ తొలి రోజుల్లోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా తెచ్చుకున్నారు .. ఇక జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు .. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది  .. అయితే పలు నివేదికల ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆర్ కేవలం 4, 00,000 పారితోషికం తీసుకున్నారట .. అయితే ఆ డబ్బును ఏం చేయాలో ఎన్టీఆర్‌కు అర్థం కాలేదట తన దగ్గర ఉంటే డబ్బును విలాసంగా ఖర్చు చేస్తానేమో సందేహంతో తన మొదటి సంపాదనని నేరుగా తన తల్లి చేతిలో పెట్టారట .. అలా ఎన్టీఆర్ నటించిన తన మొదటి మూవీ కమర్షియల్ గా హిట్ కాకపోయినా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి ..



ప్రేమ కథ సినిమాలైనా , మాస్ మూవీస్ అయినా తన పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించడం ఎన్టీఆర్ కే దక్కింది .. రీసెంట్ గానే దేవర సినిమాతో పాన్‌ ఇండియా స్థాయి లో భారీ విజయందుకున్నారు .. దర్శకుడు కొరటాల శివ తెర్కక్కించిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిగా .. ఈ సినిమాకు ఎన్టీఆర్ 60 కోట్ల వరకు  పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది . ఇక ఇప్పుడు వార్ 2 , ప్రశాంత్ నీల్‌ సినిమాలకు కూడా  అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట ..

మరింత సమాచారం తెలుసుకోండి: