గతంలో కొన్ని చిత్రాలను సైడ్ క్యారెక్టర్లలో నటించిన అనసూయ..కానీ అనసూయ కి అప్పుడు ఎలాంటి క్రేజ్ రాలేదు.. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ యాంకర్ గా  ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు మంచి క్రేజీ సంపాదించుకుంది అనసూయ.. ఆ తర్వాత పలు చిత్రాలలో  కీలకమైన పాత్రలలో నటించి నటిగా మంచి పాపులారీటి సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో అనసూయ ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంది. రంగస్థలం, పుష్ప, పుష్ప 2, రజాకర్ వంటి చిత్రాలతో మెరిసిన అనసూయ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంలో కూడా కనిపించబోతున్నదట. ఇక నిరంతరం సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలనైనా సరే నిర్మొహమాటం పడకుండా స్పందిస్తూ ఉంటుంది అనసూయ.


అలాగే పలు రకాల రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించడమే కాకుండా  పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే అనసూయ ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసినట్లు గా తెలుస్తోంది.. ముఖ్యంగా అనసూయ ఇందులో శృంగారం గురించి ఓపెన్ గాని మాట్లాడేసింది.. మనిషికి తిండి ఎలాగో అది కూడా అలాంటిదే కానీ బహిరంగంగా చేయమని మాత్రం  చెప్పనంటూ తెలియజేసింది. ఇక అలాగే ఇండస్ట్రీలో ఎవరైనా డైరెక్టర్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నించారా అని యాంకర్ అడగగా.. అందుకు అనసూయ కొంతమంది హీరోలు, డైరెక్టర్లు ప్రయత్నించారని అందులో తప్పేమీ లేదని తెలియజేసింది.


అనసూయ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అయితే అనసూయ మాటలకు కొంతమంది పలు రకాల విభిన్నమైన కామెంట్స్ తో ఈ వీడియోని వైరల్ గా చేస్తున్నారు. తన కొత్త ఇంటి శుభకార్యానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. ఇలా వచ్చిన క్రేజ్ తో అనసూయ ఆచితూచి పాత్రల విషయంలో అడుగులు వేస్తోంది. ఇక పూర్తిగా యాంకర్ అనే విషయానికి గుడ్ బై చెప్పేసినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: