
నెగిటివ్ టచ్ ఉన్న గజపతి క్యారెక్టర్ లో మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసాడు .. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు గొంతును మరీ గంభీరంగా పెట్టి అర్చినట్టు అనిపించిన మొత్తంగా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి బాగా ప్రయత్నించాడు .. ముఖ్యంగా నారా రోహిత్ తో తన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి .. ఇక నెక్స్ట్ మిరాయ్ లో కూడా మనోజ్ విలన్ గానే కనిపించబోతున్న విషయం తెలిసింది .. రీసెంట్గా వచ్చిన టీజర్ లో కూడా అదే క్లారిటీ వచ్చేసింది .. ఈ రెండు కనక బాగా క్లిక్ అయితే మనోజ్ రూపంలో టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికినట్టు అవుతుంది అయితే హీరో గాను తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉండటం ఇక్కడ గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ విషయం .
తన ఫ్యామిలీ వివాదాలతో తరచూ నలుగుతున్న మనోజ్ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు .. అలాగే భైరవం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అందరితో ఎంతో సరదాగా ఉంటూ జోకులు పేలుస్తూ వాటిని బాగా హైలెట్ చేశారు .. మరోపక్క నారా రోహిత్ , సాయి శ్రీనివాస్ ఎంత మాట్లాడినా వాళ్ళను డామినేట్ చేసేలా తన కామెడీ టైమింగ్ తో బాగా అదరగొట్టాడు . అయితే మనోజ్ ని కేవలం సీరియస్ పాత్రులకు పరిమితం చేయకుండా అతనిలో ఉన్న కామెడీ టైమింగ్ ని కూడా వాడుకుంటే బిందాస్, దొంగ దొంగది , పోటుగాడు లాంటి మంచి కామెడీ పండించే సినిమాలు కూడా వస్తాయి .. మనోజ్ మాత్రం ఇదే ఫ్లోతో వేగంగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు .. ఇక మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు ..