
టాలీవుడ్ , కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది మధుబాల .. ఫూల్ ఔర్ కాంటే సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది .. ఇక ఈ సినిమాతో హీరో అజయ్ దేవగన్ సైతం హీరోగా అడుగుపెట్టారు .. ఇక ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది .. అలా ఈ సినిమా విడుదలైన తర్వాత మూడు రోజులు మధు తన స్నేహితురాలు ఇంట్లో ఎవరికీ కనిపించకుండా దాక్కుందట .. ఎందుకంటే అదే సమయంలో యష్ చోప్రా తెరకెక్కించిన లమ్హే మూవీ కూడా విడుదలైంది .. యష్ చోప్రా సినిమా అంటే పక్క హిట్ అనే టాక్ ఉండేది .. ఇక అందులో అనిల్ కపూర్ , శ్రీదేవి కీలకపాత్రలో నటించారు .. ఆ సినిమాకు పోటీగా వెళ్లడంతో మధు ఎంతో భయపడ్డారు .. అప్పటికే శ్రీదేవి , అనిల్ కపూర్ ఎదురు పెద్ద అగ్ర నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు . అలాంటి వారితో కొత్తవారైన తమ సినిమా రిలీజ్ అవ్వటంతో అసలు ఎవరైనా చూస్తారని సందేహాలు కూడా మధుబాల కు కలిగిందట
..
అలా భయంతో తన స్నేహితురాలు ఇంట్లో మూడు రోజులు దాక్కుందట .. కానీ ఫూల్ ఔర్ కాంటే మూవీ భారీ విజయాన్ని అందుకుంది . ఆమె ఫ్రెండ్ అసలు విషయం చెప్పడంతో మధుబాల ఊపిరి పీల్చుకుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది .. అలాగే ఆ సినిమాతోనే ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది .. కానీ ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అందగా సక్సెస్ కాలేదు .. అలాగే అదే సమయంలో ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆఫర్లు కూడా తగ్గాయని అంటారు .. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్డం తెచ్చుకున్న మధుబాల అంతే త్వరగా ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లిపోయింది .. అలా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మధుబాల ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది .