టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంది. ఒకవైపు డైరెక్టర్ తో లవ్ ఎఫైర్ అని, మరొకవైపు తన బ్యానర్ మీద సినిమాల విషయంపై, అలాగే మయోసైటీస్ వ్యాధి కారణంగా ఏదో ఒక పేరైతే వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా హెల్దీ లైఫ్ కు సంబంధించి అలవాట్లను మార్చుకోవాలంటు అందుకు సంబంధించి కొన్నిటిని సమంత తన సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మెడిసిన్ గురించి కూడా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసిన సమంత ఇవి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి.


సమంత నికోటినమైడ్ ఆడెనిన్ డైన్యూక్లీయోటైడ్ అనే బ్రాండ్ బ్రాండ్ కు సంబంధించిన వాటిని సమంత ప్రమోట్ చేసింది.. ఈ టాబ్లెట్స్ శరీరంలో ఎన్ఏడి స్థాయిలను పెంచేలా చేస్తాయట. దీనివల్ల శక్తి పెరుగుతుందని త్వరగా కోలుకుంటారంటూ సమంత వెల్లడించింది.. అంతేకాకుండా వీటిని తాను తీసుకోవడమే కాకుండా గటకా సంస్థకు కూడా కాంపౌండర్ గా మారానంటూ తెలియజేసింది. వీటిని తాను పూర్తిగా నమ్ముతున్నానని రాబోయే మీ భవిష్యత్తు కోసమే అంటూ సమంత ఒక స్టోరీని కూడా రాసుకుంది.


ఈ పోస్ట్ ను చూసిన ద లివర్ డాక్టర్ సమంత పైన ఫైర్ అయ్యారు.. వృద్ధాప్యాన్ని తగ్గించే అవసరం అంటూ నకిలీ వాటిని ప్రమోట్ చేస్తోంది సమంత అంటూ విమర్శలు చేయడం జరిగింది. సైన్స్ తెలియని నటి సమంత .. ఆమె ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ బ్రాండ్ కూడా చాలా మోసపూరితమైనది.. నాడ్ అనేది జీవక్రియకు చాలా ముఖ్యమైన కో ఎంజైమ్.. అయితే NMN అనేది కేవలం నాడ్ స్థాయిలను మాత్రమే పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పడం ఒక సప్లిమెంట్ అంటూ తెలిపారు.. అయితే వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది అంటూ మార్కెట్లో మోసం చేస్తున్నారు ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా లేవు.. ఇలాంటివి వాడితే శరీరం శోషణకు గురవుతుంది అంటూ వైద్యులు తెలుపుతున్నారు. మొదట ఎలుకల మీద ప్రయోగం చేసినప్పుడు కాస్త చురుకుగా ఉన్నాయి తప్ప వాటి వయసు పెరుగుతుందని ఎక్కడ నిరూపితం కాలేదంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: