
2012 సంవత్సరంలో చరణ్, ఉపాసన పెళ్లి చేసుకున్నారు. ఉపాసన తల్లి శోభన అపోలో హాస్పిటల్స్ కు వైస్ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. శోభనకు సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమని సమాచారం అందుతోంది. 2020 సంవత్సరంలో 60వ పుట్టినరోజు సమయంలో శోభన 600 కిలోమీటర్లు రైడ్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన వార్తలు సైతం తెగ వైరల్ కావడం గమనార్హం.
ఉపాసన తల్లి శోభన వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది. 2023 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి చెన్నైకు సైకిల్ రైడ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. దీనికి ఉపాసన సైతం రియాక్ట్ అవుతూ "అమ్మా.. నీ ఛాలెంజెస్ వల్ల నా ఒత్తిడి తగ్గిపోతుంది అని పేర్కొన్నారు. రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
శోభన కామినేని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శోభనకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 31,000 మంది ఫాలోవర్లు ఉన్నాయి. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శోభన కామినేని భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకుని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ సైతం ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.