టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన సినిమాలలో డూప్ లను కానీ బాడీ డబుల్ లను కానీ వాడటానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలకు సైతం గాయాలు అవుతూ ఉంటాయి. ఆహా ఓటీటీలో బాలయ్య అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
 
అన్ స్టాపబుల్ షో అన్ని సీజన్లు వ్యూస్ పరంగా అదరగొట్టాయి. ఈ షో బాలయ్య ఇమేజ్ ను సైతం ఊహించని స్థాయిలో పెంచిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ షో ప్రోమో షూట్ సమయంలో కొన్నేళ్ల క్రితం బాలయ్య కాలికి గాయం కాగా ఆ గాయాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా బాలయ్య షూటింగ్ ను పూర్తి చేశారని సమాచారం అందుతోంది.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి ఈ స్థాయిలో డెడికేషన్ ఉన్న హీరోలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బాలయ్యలా చేయడం ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రాబోయే రోజుల్లో సైతం అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా కొనసాగుతారేమో చూడాల్సి ఉంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తే ఆహా ఓటీటీకి ఊహించని స్థాయిలో ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
 
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా బాలయ్య తనకు గతంలో సక్సెస్ ఇచ్చిన దర్శకులకు ప్రాధాన్యత ఇస్తుండటం కొసమెరుపు. గెస్ట్ రోల్స్ కు సైతం బాలయ్య సై అంటూ ఉండటం అబిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్ రావడంతో ఈ ఇయర్ మరింత స్పెషల్ గా మారనుందని చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: