నందమూరి బాలకృష్ణ జీవితంలో ఏదైనా వెలితి లోటు ఉంది అంటే అది కేవలం తండ్రి విషయంలోనే.. అప్పుడెప్పుడో జరిగిన ఈ సంఘటన బాలకృష్ణ మైండ్ లో నుండి ఇప్పటికి పోవడం లేదట. ఆయన్ని ఆ బాధ ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది అని అప్పుడప్పుడు ఆయన చెబుతూ ఉంటారు. మరి ఇంతకీ బాలకృష్ణ జీవితంలో ఉన్న ఆ వెలితి ఏంటి.. దాని గురించి తెలుసుకొని ఇప్పటికి బాధపడుతూ ఉంటారా అనేది ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ జీవితంలో ఉన్న అతిపెద్ద వెలితి ఏంటంటే..తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తన పెళ్లికి రాకపోవడం.. కొడుకు పెళ్లి సొంత తండ్రి లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందని మీరు అనుకోవచ్చు.కానీ బాలకృష్ణ పెళ్లి జరిగిందట. బాలకృష్ణ వసుంధరా దేవిలది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. వీరి పెళ్లి 1982 డిసెంబర్ 8న జరిగింది. 

అయితే ఆ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లో హడావిడిగా తిరుగుతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండగా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల్లో ఒకరిగా మెదిలి ముఖ్యమంత్రి అవ్వాలి అన్నదే ఎన్టీఆర్ లక్ష్యం.. దాంతో తన లక్ష్యం కోసం తన కొడుకు పెళ్లి ని కూడా పక్కన పెట్టేశారు. అలా సీనియర్ ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ కూడా బాలకృష్ణ పెళ్ళికి హాజరవ్వలేదట.అయితే తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ పెళ్లికి రాకపోవడం గురించి ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. నా జీవితంలో ఏదైనా అతిపెద్ద లోటు ఉందంటే.. అది మా నాన్నగారు నా పెళ్లికి రాకపోవడమే. అయితే నా పెళ్లి జరిగిన సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల పెళ్లికి రాలేదు.

ఇక నా పెళ్ళికి రాకపోయినప్పటికీ అదే రోజు ప్రజలకు దగ్గరగా ఉండడం నాకు సంతోషాన్నిచ్చే విషయం.. అలా నాన్నగారు పెళ్లికి రాకపోవడం అనే బాధని ఎప్పటికీ మర్చిపోను అంటూ బాలకృష్ణ ఆ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ఇక బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గురించి ఆయన పాల్గొన్న ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో లో ప్రతి ఒక్క ఈవెంట్లో నటించిన ప్రతి సినిమాలో కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.తన తండ్రే తన గురువు,తన దైవం, తనకు ఆదర్శం అని గొప్పగా చెప్పుకుంటారు. అలా తండ్రి అంటే బాలకృష్ణకు చెప్పలేనంత ఇష్టం అని ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: