
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా దాదాపు నాలుగు సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ వస్తోంది. ఇప్పటికే నాలుగు ఐదు సార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కూడా వాయిదా వేశారు. ఎట్టకేలకు షూటింగ్ ముగిసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అనుకున్న సమయంలో మరోసారి అనూహ్య పరిణామాల మధ్య హరిహర వీరమల్లు సినిమాను మేకర్స్ వాయిదా వేయక తప్పని పరిస్థితి. దీంతో కళ్లు కాయలు కాచేలా ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు గా వెయింటింగ్ లో ఉన్నా వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ గా మారింది.
టాలీవుడ్లో కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా యావత్ తెలుగు సినిమా అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హరిహర వీరమల్లు సినిమా కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటే సినిమా వాయిదా పడడంతో ఒక్కసారిగా అందరూ నిరాశలోకి వెళ్లిపోయారు. సినిమా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు చెప్పిన కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించలే. మరో మూడు నెలల్లోనే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే వీరమల్లు సినిమా కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించాలని అటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఎగ్జిబిటర్లు . . . డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. వీరమల్లు సినిమా త్వరలో థియేటర్లలోకి వస్తే థియేటర్లో కళకళలాడతాయి అన్న ఆశలతో ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు