నివేద థామస్ తెలుగులో జై లవకుశ, 118, నిన్ను కోరి, జెంటిల్మెన్,షాకిని డాకిని, 35 చిన్న కథ కాదు,బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం గుర్తుపట్టకుండా మారిపోయింది. బరువు బాగా పెరిగిపోవడంతో నివేదా థామస్ ని చూసి చాలామంది అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.ఇదేంటి ఈ హీరోయిన్ ఇంత బరువు పెరిగిపోతుంది అని మాట్లాడుకుంటున్నారు.అయితే కొంతమంది హీరోయిన్లు పెళ్లయ్యాక బరువు పెరుగుతారు. పెళ్లయి పిల్లలు పుట్టాక వారి బాడీలో ఛేంజెస్ కనిపిస్తాయి. కానీ నివేదా థామస్ కి పెళ్లి కాకుండానే తన రూపం మొత్తం మారిపోయింది.దీంతో చాలామంది నివేదా థామస్ బరువు గురించే మాట్లాడుకుంటున్నారు.. 

అయితే నివేదా థామస్ తాజాగా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొంది. అయితే ఇందులో గత ఏడాది అనగా 2024 లో బెస్ట్ ఫిమేల్ లీడ్ అవార్డు అందుకుంది నివేద థామస్.  35 చిన్న కథ కాదు అనే సినిమాలోని తన నటనకి గానూ నివేద థామస్ కి బెస్ట్ ఫిమేల్ లీడ్ అవార్డుని అందుకుంది.అయితే ఈ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకి వెళ్ళిన సమయంలో నివేదా థామస్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ ఈవెంట్ కి నివేదా థామస్ చీర కట్టుకొని అచ్చ తెలుగు ఆడపిల్లలా వచ్చినప్పటికీ ఆమె బరువుని చూసి మాత్రం చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో నివేదా థామస్ ని ట్రోల్  చేస్తున్నారు.
 ఇక ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ అయితే చాలా దరిద్రంగా ఉంది. ఆ వ్యక్తి పెట్టిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇది చూసిన చాలామంది నివేదా థామస్ అభిమానులు వీడికి ఏం మాయ రోగం.. ఇలాంటి చెత్త కామెంట్ పెట్టాడు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ నెటిజన్ నివేద థామస్ పై ఎలాంటి కామెంట్ పెట్టాడంటే..నివేద థామస్ బరువుపై ఎక్స్ ఖాతాలో జులాయ్ అనే ఐడితో ఓ నెటిజన్ "ఒక వయసు వచ్చాక సె** లేకపోతే ఆడవాళ్లు లావు అయిపోతారు" అంటూ అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.ఇక ప్రస్తుతం ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ నెట్టింట్లో దుమారం సృష్టిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: