మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న  కుబేర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ట్రైలర్ చూసినా ఈ సినిమా స్టోరీ లైన్ గురించి స్పష్టత రాలేదు.  అయితే శేఖర్ కమ్ముల మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  ప్రపంచంలో బాగా డబ్బున్న వ్యక్తికి ఏమీ లేని పేదవాడికి జరిగే పోరాటమే  కుబేర అని ఆయన అన్నారు.  ఒక్క మాటలో బిలియనీర్  వర్సెస్ బెగ్గర్ కథ ఈ సినిమా అని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో రెండు ప్రపంచాలను చూపించామని ఈ సినిమా చూశాక ప్రేక్షకుల్లో మార్పు వస్తుందని ఆయన తెలిపారు.  కుబేర సినిమాలో పొలిటికల్ యాంగిల్ ఉంటుందని  సందర్భానికి అనుగుణంగా సీన్స్  ఉంటాయి తప్ప ఎక్కువగా ఉండవని ఆయన   పేర్కొన్నారు.  కొన్ని రూల్స్ నాగార్జున మాత్రమే చేయగలరని  ఈ సినిమాలో ఆయన కొత్తగా కనిపిస్తారని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.  కుబేర  చుసిన తర్వాత ధనుష్ మాత్రమే ఇలాంటి రోల్ చేయగలదని అనిపిస్తుందని  శేఖర్ కమ్ముల అన్నారు.

ధనుష్  అద్భుతంగా యాక్ట్ చేశారని  ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ధనుష్ కు కథ చెప్పే సమయంలో భయపడ్డానని  శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.  గత సినిమాల కంటే ఈ సినిమా పది రెట్లు  గొప్పగా ఉంటుందని  డీఎస్పీ మ్యూజిక్  సినిమాకు హైలెట్ అవుతుందని  చెప్పుకొచ్చారు.  ధనుష్ గొప్ప నటుడని ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్  టేక్  లో చెబుతాడని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

సినిమా షూట్ ముంబైలో జరిగిందని అక్కడ అనుమతులు దొరకాలంటే కూడా  ఇబ్బంది అని  అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అని  ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు   వెళ్లాలంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.  ఈ సినిమాలో ఎక్కువమంది స్టార్స్ ఉండటం వల్ల  కొంచెం ఎక్కువ సమయం పట్టిందని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.  నా సినీ కెరీర్ లో ఎప్పుడూ ఎదురుదెబ్బలు తగలలేదని ఆ విషయంలో లక్కీ అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.  నేను నా రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటానని లాభాల్లో వాటా అడగనని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: