ఇప్పటివరకు త్రివిక్రమ్ స్టార్ హీరోలతో సినిమాలను తీసి మంచి విజయాలను అందుకున్నారు. గతంలో కూడా త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి వీరు కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు వారికి తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది. ఆగస్టు నెలలో వీరి సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే వీరి ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిందని త్వరలో క్యాస్టింగ్ ఎంపిక చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే విషయం తెలియాలి మరి. త్రివిక్రమ్ కూడా చివరిగా మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాని కూడా మొదలుపెట్టలేదు త్రివిక్రమ్.మధ్యలో అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపించిన ఎందుకో సెట్ కాలేదు. మరి వెంకటేష్ తో ఎలాంటి కథను ఎంచుకొని సక్సెస్ అందుకుంటారు చూడాలి మరి త్రివిక్రమ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి