
అయితే ఇది మంచు విష్ణు కి అగ్ని పరీక్ష అనడానికి బోలెడన్ని కారణాలు కూడా ఉన్నాయి .. ఇప్పటిదాకా లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో ఏ సినిమాకు పెట్టినంత బడ్జెట్ దీనికి పెట్టి సినిమాను చేశారు .. అలాగే ఎంతో అనుభవం ఉన్న మోహన్ బాబు కంటెంట్ మీద నమ్మకంతో కొడుకు సాహసానికి ఒకే చెప్పారు .. అలాగే భారీ క్యాస్టింగ్ ను కూడా తీసుకువెళ్లి న్యూజిలాండ్లో షూటింగ్ చేశారు .. బయట వినిపిస్తున్న టాక్ లో 200 కోట్ల బడ్జెట్ అయిందని మాట గట్టిగా వినిపిస్తుంది .. అయితే ఇది ఎంతవరకు నిజమనేది విష్ణుకు మాత్రమే తెలుసు .. మహాభారతం లాంటి ఎపిక్ ని హ్యాండిల్ చేసిన గొప్ప డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగిని దర్శకుడు గా తీసుకోవడం ద్వారా విష్ణు వేసిన ఎత్తిగడ ఎలాంటి ఫలితం ఇస్తుందో కూడా వెండితెరపై చూడాలి .
అలాగే గతవారం కుబేరతో బాక్సాఫీస్ కు మళ్ళీ మంచి జోష్ వచ్చింది .. మరీ పుష్ప 2 రేంజ్ లో రికార్డులు అందుకోవటం లేదు కానీ దాని మీద ఉన్న అంచనాలు మించి రెండో వారంలో ఎంట్రీ ఇవ్వకుండానే 100 కోట్ల గ్రాస్ ను అందుకోవటం ట్రేడ్ ని కొంత ఆనందంలో పడేసింది .. ఇక కన్నప్ప కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనీసం రెండు వారాలపాటు స్ట్రాంగ్ గా ప్రేక్షకుల ముందు ఉండటం ఖాయం .. అలాగే విష్ణు నటన మోహన్లాల్ , అక్షయ్ కుమార్ , మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోల పాత్రలు అంచనాలు పెంచడానికి కొంత దోహదపడుతున్నాయి కానీ .. డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించిన మంచు విష్ణు కల ఏ రూపంలో నెరవేరుతుందో రేపటికి ఓ క్లారిటీ రానుంది.