జర్నలిస్టు స్వేచ్ఛ సూసైడ్ కేసు రోజురోజుకి సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవడంలో ప్రధాన నిందితుడిగా ఆమె ప్రియుడు పూర్ణచందర్ ని అరెస్టు చేసి నిజం కక్కించారు. అయితే అరెస్టు కాకముందు పూర్ణచందర్ ఒక 5 పేజీల లేఖ విడుదల చేసి స్వేచ్ఛ చావుకు నేను కారణం కాదని పరోక్షంగా స్వేచ్ఛ తండ్రి మీదికే వెళ్లేలా ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్ణచందర్ అరెస్టయ్యారు. ఇక స్వేచ్ఛ కూతురు పూర్ణచందర్ పై సంచలన ఆరోపణలు చేసింది. పూర్ణచందర్ మంచివాడు కాదని, ఆయన మా అమ్మను ఎన్నో విధాలుగా టార్చర్ చేశాడని, చాలాసార్లు నేను కూడా ఆయన మంచివాడు కాదని చెప్పానని, నన్ను కూడా చెప్పుకోరానిచోట అసభ్యంగా టచ్ చేశాడని, అతనే మా అమ్మ చావుకి కారణం అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.

 ఇక స్వేచ్ఛ కూతురు వ్యాఖ్యలతో పూర్ణచందర్ పై ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. దాంతో పూర్ణచందర్ పోలీసుల కోటింగ్ కి తన తప్పు ఒప్పుకున్నారు. నేనే స్వేచ్చని పెళ్లి చేసుకుంటానని మోసం చేశానని ఒప్పుకున్నారు. అయితే పూర్ణచందర్ ఇచ్చిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో బిఆర్ఎస్ మాజీ ఎంపీ పేరు కూడా వచ్చినట్టు నెట్టింట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ స్టేట్మెంట్లో ఏముందంటే.. నేను స్వేచ్ఛతో ఉంది నిజమే. అలాగే ఆమెను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాను.2009 నుండి నాకు ఆమెతో పరిచయం ఉంది.. రెండో పెళ్లి అయిన సందర్భంలో కూడా నువ్వు భర్త కి విడాకులు ఇవ్వు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాను.

ఆ తర్వాత నన్ను నమ్మి స్వేచ్ఛ విడాకులు తీసుకుంది  కానీ నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు అంటూ చెప్పారట. అలాగే గత వారం రోజుల క్రితమే స్వేచ్ఛ పూర్ణ చందర్ కలిసి అరుణాచలం వెళ్ళినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఇక పెళ్లి చేసుకోమని స్వేచ్ఛ తరచూ వేధించడంతో నేను చేసుకొనని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకుపో.. నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి అని స్వేచ్ఛని బెదిరించడని తెలుస్తోంది.అంతేకాకుండా నేను నీతో రిలేషన్ లో ఉన్న విషయం కూడా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావుకి తెలుసు..నువ్వు ఏం చేస్తావో చేసుకోపో అంటూ స్వేచ్ఛని బెదిరించాడట. ఈ విషయం మీదే స్వేచ్ఛ చనిపోయే వారం రోజుల ముందు గొడవ బాగా జరిగిందట. ఆ తర్వాత స్వేచ్ఛ బాధతో సూసైడ్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: