పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ది రాజా సాబ్ .. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ను దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేస్తుండ గా హర్రర్ కామెడీ గా ఇక  సినిమా ని తీసుకొస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై మంచి అంచనాలు పెంచేసింది .. అలాగే ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది ..  ఓ సాంగ్ షూటింగ్ మ‌త్రం మిగిలి ఉందని .. స్పెషల్ ఐటెం సాంగ్ అని కూడా తెలుస్తుంది.. అయితే ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ డాన్స్ చేస్తుందనేది ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు త‌గ్గట్టుగా ఆ పాట‌ను డిజైన్ చేస్తున్నారు. అయితే ఈ పాట కోసం థ‌మ‌న్ ఓ బాలీవుడ్ సినిమా సాంగ్ ను రీమిక్స్ చేయాల‌ని ప్లాన్ చేశాడట.


కానీ త‌ర్వాత ఆలోచ‌న విర‌మించ‌కుని ఓ ప్రెష్ సాంగ్ తోనే రావాల‌ని నిర్ణయించుకున్నాడు. ఇక పోతే ఆ పాట‌లో ఐటం భాగ‌మా తోలుతా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అయితే బాగుంటుంద‌నుకున్నారు.. ఆమెను అప్రోచ్ కూడా అయ్యారు కానీ.. దానికి ఆమె నో చెప్పింది .. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ని తీసుకునేందుకు మేకర్స్‌ చూస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఈ సాంగ్లో నటించేందుకు ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాలని కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట‌ .. ఇక దీంతో ‘రాజాసాబ్’ స్పెషల్ సాంగ్ కోసం కరీనా ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .. ఇక ఈ సినిమా లో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు .. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వప్రసాద్  నిర్మిస్తున్నారు .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: