పుష్ప ..పుష్ప రాజ్ . ఇది జస్ట్ ఒక పేరు మాత్రమే కాదు ఒక సినిమా పేరు అంతకన్నా కాదు .. చాలామందికి ఇది ఒక బిగ్ ఎమోషన్ గా మారిపోయింది . ఎవరిని పొగడాలి అన్నా..ఎవ్వరిని తిట్టాలి అన్నా.. ఎవరి పై రివేంజ్ తీర్చుకోవాలి అన్నా ఈ సినిమా లోని డైలాగ్స్ ని బాగా వాడేస్తుంటారు జనాలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే.  పుష్ప సినిమా కారణంగా అల్లు అర్జున్ రేంజ్ ఏవిధంగా మారిపోయింది అనేది అందరికీ తెలిసిందే.


పుష్పవన్ , పుష్ప టు సినిమాలతో అల్లు అర్జున్ అదే విధంగా సుకుమార్ రేంజ్ టోటల్గా మారిపోయింది.  ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ సినిమా షేక్ చేసేసింది . అయితే పార్ట్ వన్ కి ఇండియా మొత్తం షేక్ అయితే పార్ట్ 2 మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ లో పుష్పరాజ్  మానియాను కొనసాగిస్తుంది అనే చెప్పాలి.  లేటెస్ట్ గా వరల్డ్ ఫేమస్ టెన్నిస్ టోర్నమెంట్ వారు చేసిన పని పుష్పరాజ్  మానియా ఏంటి అనేది మరొకసారి గుర్తు చేసింది.  దీనితో సోషల్ మీడియాలో మరొకసారి పుష్ప2  సినిమాకి సంబంధించిన హ్యాష్  ట్యాగ్స్ ట్రెండ్ అవ్వడమే కాదు పుష్ప రాజ్ ని అందరూ గుర్తు చేసుకునేలా చేసింది.

 

వరల్డ్ ఫేమస్ టెన్నిస్ టోర్నమెంట్ వారు  సోషల్ మీడియాలో పాపులర్ ఆటగాడు జోకో విచ్ కి పుష్పరాజ్ సిగ్నేచర్ తగ్గేదేలే పోస్ట్ తో ప్రచారం చేయడమే దీనికి మెయిన్ రీజన్.  ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .  వరల్డ్ ఫేమస్  టెన్నిస్ టోర్నమెంట్ వారు సోషల్ మీడియాలో ఆటగాడు జోక్ విచ్చుకు పుష్ప రాజ్ సిగ్నేచర్ తగ్గేదెలే  అని పోస్ట్  ప్రసారం చేయడం ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది.  దీంతో పుష్ప రాజ్ మానియా ఎలా ఉంది అనేది అందరూ అర్థం చేసుకుంటున్నారు . ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా మూడో భాగం కూడా రాబోతుంది అంటూ అందరికీ తెలిసిందే . ప్రస్తుతం అల్లు అర్జున్ - అట్లితో చేస్తున్న సినిమా కోసం బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు.  ఈ సినిమా కంప్లీట్ అయ్యాక పుష్ప3 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు మేకర్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: