శృతిహాసన్ అడివి శేష్ నిజంగానే గొడవలు పెట్టుకున్నారా..ఈ గొడవ కారణంగానే శృతిహాసన్ డెకాయిట్ మూవీ నుండి తప్పకుందా.. శృతిహాసన్ ని తప్పించి మృణాల్ ఠాకూర్ ని తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అనేది ఎప్పుడు తెలుసుకుందాం.. అడివి శేష్ శృతిహాసన్ కాంబో లో డెకాయిట్ మూవీ ని అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో శృతిహాసన్ లుక్స్ కి సంబంధించిన పోస్టర్ కూడా అఫీషియల్ గా రిలీజ్ చేశారు.కానీ సడన్గా ఈ సినిమా నుండి శృతిహాసన్ ని తప్పించి ఆమె ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ చేరినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా డెకాయిట్ మూవీ కి సంబంధించిన మూవీ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో చాలామంది ఇదేంటి శృతిహాసన్ ఉన్న ప్లేస్ లో మృణాల్ ఉంది. 

కానీ కట్ చేస్తే సెకండ్ హీరోయిన్ గా కాదు శృతిహాసన్ ని పూర్తిగా సినిమా నుండి తప్పించి ఆమె ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ని పెట్టినట్టు అందరికీ అర్థమైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ శృతిహాసన్ తో ఉన్న గొడవలు డెకాయిట్ నుండి తప్పించడానికి కారణం అన్ని విషయాలు బయట పెట్టారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. శృతిహాసన్ ని తొలగించడానికి ఒకే ఒక్క కారణం షూటింగ్ షెడ్యూల్.. శృతిహాసన్ కేవలం డెకాయిట్ మాత్రమే కాదు రజినీకాంత్ గారి కూలీ సినిమాలో కూడా చేస్తుంది. అయితే ఈ రెండు సినిమాలకు షూటింగ్ టైమింగ్స్ సెట్ కావు. అయితే డెకాయిట్ సినిమా కోసం ఎక్కువ సమయం పడుతుంది అని చెప్పాను. దాంతో డెకాయిట్ మూవీకి సింక్ కావాలి కాబట్టి శృతిహాసన్ ని ఇందులో నుండి తప్పించాము.

అలాగే శృతిహాసన్ తో గొడవలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.నాకు ఆమెతో ఇప్పటికీ స్నేహమే ఉంది.మేమిద్దరం స్నేహితులుగానే కొనసాగుతున్నాం. కేవలం షూటింగ్ షెడ్యూల్ కారణంగానే శృతిహాసన్ ని తప్పించాము. అలాగే మృణాల్ ఠాకూర్ కి ఈ సినిమా స్టోరీ చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోయిన్ ని నేను ఇప్పటివరకు చూడలేదు. అందుకే మృణాల్ ఠాకూర్ కి గౌరవం ఇచ్చేలా ఆమెకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశాము. అలాగే ఇందులో ఇద్దరు హీరోలకు సమానమైన పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించింది అంటూ అడివి శేష్ చెప్పుకోచ్చారు.ఇక డెకాయిట్ మూవీ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో యార్లగడ్డ సుప్రియ నిర్మిస్తోంది.ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: