తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టు గా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోగా, హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరో గా మరి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈయన హీరో గా నటించిన పలు సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. 

ఇక చైల్డ్ ఆర్టిస్టు టు హీరోయిన్గా మంచి గుర్తింపును ఈ మధ్య కాలంలో సంపాదించుకున్న వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈమె తన చిన్న తనంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె ప్రస్తుతం హీరోయిన్గా నటిస్తోంది. హీరోయిన్గా కూడా ఈ బ్యూటీ ఎన్నో విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఈమె నటిగా మంచి జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే బాహుబలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సాత్విక్ వర్మ హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

వరలక్ష్మీ పప్పుల సమర్పణలో... కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రేమిస్తున్నా అనే సినిమాతో సాత్విక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ లో తెలుగమ్మాయి ప్రీతి నేహా హీరోయిన్గా కనిపించబోతుంది. ఈమె ఈ సినిమా తోనే వెండి తెరకు పరిచయం కానుంది. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సాత్విక్ హీరో గా ఎంట్రీ ఇవ్వనున్న మొదటి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో ఏ స్థాయి గుర్తింపును దక్కించుకుంటాడు చూడాలి. ఇకపోతే ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వేళ చాలా మంది ఈయన హీరో మెటీరియల్ గా మారిపోయాడు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: