తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన తన కెరీర్ బిగినింగ్ నుండి ఎక్కువ శాతం క్లాస్ సినిమాలను రూపొందిస్తూ, లవ్ రొమాంటిక్ సినిమాలను రూపొందిస్తూ దర్శకుడిగా అద్భుతమైన సక్సెస్ను అందుకున్నాడు. ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈయన కెరియర్లో భారీ అపజయాన్ని అందుకున్న సినిమాలలో అనామిక మూవీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మూవీ లో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమా భారీ అపజయాన్ని అందుకుంది. 

అనామిక మూవీ తర్వాత శేఖర్ ఎప్పుడు మళ్లీ లేడి ఓరియంటెడ్ సినిమా వైపు వెళ్లలేదు. ఎక్కువ శాతం లవ్ రొమాంటిక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. వాటితో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. తాజాగా శేఖర్ కమ్ముల, ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నాగార్జున కీలక పాత్రలో కుబేర అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కొంత కాలం క్రితమే విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. 

ఇప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇకపోతే శేఖర్ కమ్ములా తన నెక్స్ట్ సినిమా విషయంలో అనామిక ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. అనామిక తర్వాత శేఖర్ మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ని రూపొందించబోతున్నట్లు, అందులో సమంత ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే అనామిక సినిమా తర్వాత శేఖర్ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇప్పటికే శేఖర్, సమంత కు ఓ స్టోరీ ని వినిపించినట్లు, అది బాగా నచ్చడంతో సమంత కూడా శేఖర్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: