టాలీవుడ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాత గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఇకపోతే దిల్ రాజు ఎక్కువగా ప్రతి సినిమా విషయంలో చురుగ్గా పాల్గొంటూ ఉండడంతో ఆయన మామూలు ప్రేక్షకులకు కూడా తెలుసు. కానీ తన సోదరుడు అయినటువంటి శిరీష్ పెద్దగా ఎవరికి తెలియదు. కాకపోతే దిల్ రాజు నిర్మించిన ప్రతి సినిమాలో ఈయన నిర్మాతగా ఉంటాడు. అలాగే ప్రతి సినిమా డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఈయన భాగస్వామ్యం ఉంటుంది. ఈయన ఎక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనాడు.

అలాగే పబ్లిక్ ఈవెంట్లలో మాట్లాడడు. దాని ద్వారానే ఈయన పెద్దగా ఇండస్ట్రీ జనాలకు తప్పిస్తే బయటికి జనాలకు తెలియదు. ఇకపోతే తాజాగా ఈయన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో ఈయన అనేక ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన మేము గేమ్ చెంజర్ మూవీ ని రూపొందించడం, ఆ సినిమా పెద్ద మొత్తంలో నష్టాలను తీసుకువచ్చింది. ఆయన ఆ సినిమా హీరో, దర్శకుడు కనీసం ఫోన్ చేసి కూడా ఎలా ఉంది అని అడగలేదు అని చెప్పాడు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో ఈయన స్వారీ కూడా చెప్పాడు. ఇకపోతే శిరీష్ అదే ఇంటర్వ్యూలో భాగంగా మైత్రి సంస్థ వల్ల కూడా మాకు పెద్దగా లాభం జరగలేదు అని చెప్పాడు.

మైత్రి సంస్థ వారు రామ్ చరణ్ హీరో గా రూపొందిన  రంగస్థలం మూవీ ని నిర్మించారు. ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను యువి సంస్థ వారు కొనుగోలు చేశారు. కాకపోతే మేము ఆ సినిమాను విడుదల చేశాము. మేము విడుదల చేసినందుకు ఆ సినిమా ద్వారా మాకు ఏదో కొంత డబ్బు వచ్చింది. కానీ ఆ సినిమా ద్వారా యూవీ క్రియేషన్స్ వారికే డబ్బులు వచ్చాయి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే శిరీష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ అనేక వివాదాలకి దారి తీసేలా కూడా ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: