చిత్ర పరిశ్రమ లో చాలామంది హీరోయిన్ వస్తుంటారు , పోతుంటారు కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తొలి సినిమా తోనే బాగా క్రేజ్‌ తెచ్చుకొని ఇండస్ట్రీలు అవకాశాలు అందుకుంటారు .. ఇప్పుడు అలాగే అచ్చం మరో 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని తన చుట్టూ తిప్పుకునేలాగా మరో హీరోయిన్ సిద్ధమవుతున్నారు .. ఇక ఈ అందాల బ్యూటీ మరెవరో కాదు సప్తమి గౌడ .. కాంతారా సినిమా తో సౌత్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది సప్తమి .. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించడమే కాకుండా అందర్నీ మెప్పించింది .. అలాంటిది ఈ అంద‌ల‌ బ్యూటీ ఇప్పుడు నితిన్ కు జంటగా తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది .. అయితే తమ్ముడు సినిమా జులై 4న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నక్రమంలో .. సప్తమి గౌడ కూడా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు ..

ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది .. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా తన పాత్ర ఉంటుందని కూడా చెప్పింది .. ఎలాంటి సినిమాలు వచ్చినా చేసేందుకు తను రెడీగా ఉన్నానని కూడాా చెప్పుకొచ్చింది .. అలాగే ఆఫర్స్ తనకు వస్తూనే ఉన్నాయని కూడా చెప్పారు సప్త‌మి .. పుష్ప సినిమాలో రష్మిక చేసిన పాత్ర తనకు చాలా నచ్చిందని అలాంటి ఆఫర్లు వస్తే అసలు వదులుకోనని కూడా క్లారిటీ ఇచ్చింది .. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటించబోతున్నట్లు చెప్పుకొచ్చింది .. అలాగే కోలీవుడ్ , కన్నడలో కూడా సినిమాలు చేస్తున్నట్టు చెప్పింది .. కానీ వాటి వివరాలు త్వరలోనే చెబుతానని పేర్కొంది .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: