కన్నడ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా పేరు సంపాదించిన యశ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం kgf 1,2 చిత్రలతో బారి పాపులారిటీ సంపాదించుకున్నారు. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి హీరో యశ్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఎన్నో చిత్రాలు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే తనకు నచ్చిన కథను మాత్రమే ఎంపిక చేసుకుంటూ వెళుతున్నారు. గతంలో ఒక ఖరీదైన ఇల్లును కూడా కట్టించారు.. ఆ తర్వాత ఎన్నో కార్లు బైక్స్ వంటివి కొనుగోలు చేశారు హీరో యశ్.


ఇప్పుడు తాజాగా మరొక కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు యొక్క నెంబర్ ప్లేట్లు కూడా ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. తన సినిమా షూటింగ్ల కోసం ముంబైలో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉన్న సమయంలోనే లగ్జరీ కారును కొనుగోలు చేశారు యశ్. లెక్సస్ LM 350H 4S అల్ట్రా లగ్జరీ కారణ కొనుగోలు చేశారు. అయితే ఈ కార్లు ప్రస్తుతం షారుక్ ఖాన్, రణబీర్ కపూర్ అంటే స్టార్ హీరోల దగ్గర మాత్రమే ఉన్నాయట.


ఈ కారులో చాలా ఫీచర్స్ ఉన్నాయని చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఈ అల్ట్రా లగ్జరీ కారు ధర సుమారుగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఉందని.. హీరో యశ్ కొనుగోలు చేసిన కారు నీలిరంగు కలదు ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కారణం మహారాష్ట్ర ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా సమాచారం.. నెంబర్ విషయానికి వస్తే..MH47CB055.. ఈ నెంబర్ ఇంగ్లీష్ ప్రకారం BOSS అనేలాగ కనిపిస్తుందట అందుకే ఈ నెంబర్ ని చాలా స్పెషల్ గానే యశ్ తీసుకున్నట్లు సమాచారం ఈ నెంబర్ కోసం లక్ష రూపాయలు అదనంగా మరి చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ కారులో హీటెడ్ వెంటిలేటర్ సీట్లు, ప్రతి సీటుకి ప్రత్యేకించి స్క్రీన్లు, మినీ ఫ్రిడ్జ్, ఆటోమేటిక్ డోర్ సిస్టం కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: