పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా చాలా డిలే అవుతూ ఉండడంతో క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ ని పూర్తి చేశాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా... ఏ ఏం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు లేవు అనే ప్రశ్న ఈ మూవీ నిర్మాత రత్నం కు  ఎదురు కాక... ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయితే ఒక్క సారిగా సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుతాయి అని ఆయన చెప్పాడు. దానితో పవన్ అభిమానులు ఈ సినిమా ట్రైలర్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జూన్ 12 వ తేదీన కాకుండా జూలై 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగా రేపు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన పనులు అన్నీ కంప్లీట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను పవన్ చూశాడు.

అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ప్రస్తుతం ఓజి అనే మూవీ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ గ్లీమ్స్  వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ గ్లీమ్స్ వీడియోకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక హరిహర వీరమల్లు ట్రైలర్ కు కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ట్రైలర్ కి కూడా ఓజి మూవీ గ్లీమ్స్ వీడియో రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: