పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం ఓజి అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్ దాస్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ స్టార్ట్ అయిన కొంతకాలానికి ఈ మూవీ నుండి మేకర్స్ ఓ వీడియోని విడుదల చేశారు. అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దానితో ఒక్క సారిగా ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. దానితో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ..? ఎప్పుడు చూద్దామా అని పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంత కాలం క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇకపోతే గత కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ కాస్త డిలే అవుతుంది అని , ఈ మూవీ సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల కావడం కష్టం అని ఓ వార్త వైరల్ అవుతూ వస్తుంది. దీనితో మళ్ళీ పవన్ ఫ్యాన్స్ డిలా పడిపోయారు.

అలాంటి సమయంలోనే ఈ మూవీ బృందం వారు ఒక సూపర్ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఓజి మూవీ సెప్టెంబర్ 25 వ తేదీన కచ్చితంగా విడుదల అవుతుంది. కొంత మంది ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కాదు. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. అవి మీరు ఏమాత్రం నమ్మకండి. అవి పూర్తిగా అవాస్తవం అని ఓజి యూనిట్ చెప్పుకొచ్చింది. దానితో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk