సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాక కొంత మంది కాస్త క్రేజ్ వస్తే చాలు అద్భుతమైన లైఫ్ ను గడుపుతూ ఉంటారు. అలాగే అద్భుతమైన కార్లను కొనుగోలు చేస్తూ అందులో తిరుగుతూ ఉంటారు. కానీ ఓ బ్యూటీ మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోకు ఆమె భార్య. ఆమెకు కోట్లల్లో ఆస్తి ఉంది. అలాగే ఇండియా వ్యాప్తంగా నటిగా ఆమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. అలాగే ఆమెకు ఎన్నో అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో కూడిన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఆమె పక్కన పెట్టి తాజాగా ముంబై వీధిలో ఓ చిన్న ఆటోలో తిరుగుతుంది.

అద్భుతమైన స్టార్ ఈమేజ్ కలిగి ఉండి, కోట్లల్లో ఆస్తి పస్తులు ఉండి ఎన్నో కార్లను పెట్టుకొని కూడా ఆటోలో తిరుగుతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ఆలియా భట్. ఈమె తాజాగా ముంబై వీధుల్లో ఆటోలో వెళుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమెకు ఎన్నో కార్లు ఉన్నా ఈమె ఆటోలో వెళ్లడానికి ప్రధాన కారణం ఆమె వెళ్ళాలి అనుకునే ప్లేస్ చాలా ఇరుకుగా ఉంటుంది అని , అక్కడికి భారీ కార్లు వెళ్లవు అని  , దానితో ఆమె ఆటోలో వెళ్లడం కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆటోలో తాను వెళ్ళాలి అనుకున్న ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఈ వీడియో వైరల్ అవుతూ ఉండడంతో అనేక మంది ఆలియా అభిమానులు ఆలియా చాలా గ్రేట్. ఎన్నో కోట్ల ఆస్తి ఉండి , ఎన్నో కార్లు పెట్టుకొని కూడా అత్యంత సామాన్యమైన జీవనం గడిపే మహిళల ఆటోలో వెళుతుంది. ఆమె గ్రేట్ అంటూ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఆలియా అనేక సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా కేరిర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: