పాన్ ఇండియా హీరో "ప్రభాస్" సినిమాలో కరీనాకపూర్ ఐటెం సాంగ్ లో నటించబోతుంది అన్న వార్త ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.  మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈ న్యూస్ బాగా హర్ట్ చేసింది . మా ప్రభాస్ సినిమాలో ఆ పెళ్లి అయిన ఆంటీ నా..? అది కూడా ఇద్దరు పిల్లలు ఉన్న ఆంటీ నా..? అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు . సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు జనాలు. అయితే తాజాగా మారుతిసినిమా విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది .


ఫిలిం సర్కిల్స్ లో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఈ సినిమాలో హీరోయిన్ గా ముగ్గురు  బ్యూటీస్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే కరీనాకపూర్ ని ఐటెం సాంగ్ లో నటింపజేస్తే  మొత్తం నలుగురు బ్యూటిస్ అవుతారు అని..ప్రభాస్ రొమాన్స్ చేసినట్లు ఉంటుంది  అని .. అది ఆయనకు స్పెషల్ క్రేజీ ఫీలింగ్ కలుగ చేయడమే కాకుండా తెరపై కూడా మంచి మార్కులు పడేలా చేస్తుంది అని .. మారుతి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది.  కానీ ఇప్పుడు కరీనా కపూర్ కాకుండా వేరే హీరోయిన్ ని ఆ ప్లేస్ లోకి తీసుకురాబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది .



ఆమె మరి ఎవరో కాదు ప్రభాస్ తో నటించి మంచి హిట్ టాక్ అందుకున్న తమన్నా . ప్రభాస్ - తమన్నా కాంబో ఎలా ఉంటుందో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా "పచ్చబొట్టేసిన" సాంగ్ లో ఇద్దరి కెమిస్ట్రీ రేంజ్ లో ఉంటుంది.  మరొకసారి అదే కెమిస్ట్రీని ప్రూవ్ చేయబోతున్నాడు మారుతి అంటూ జనాలు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు . మారుతి దర్శకత్వంలో  ప్రభాస్ "రాహా సాబ్" అనే  సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కరినా అనుకున్నారట. కానీ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ చూసి మారుతి ఆ ప్లేస్ లోకి తమన్నాను తీసుకొచ్చినట్లు తెలుస్తుంది . తమన్నా - ప్రభాస్ చిందులు వేస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

!?

మరింత సమాచారం తెలుసుకోండి: